తెలంగాణ

telangana

ETV Bharat / state

లారీని తప్పించబోయి బోల్తాపడిన బస్సు

నల్గొండ జాతీయ రహదారిపై అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

By

Published : May 22, 2019, 10:40 AM IST

బోల్తాపడిన బస్సు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడింది. ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి బస్సు అదుపుతప్పినట్లు కండక్టర్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కట్​పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు.

బోల్తాపడిన బస్సు

ABOUT THE AUTHOR

...view details