నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ వచ్చి హోం క్వారంటైన్లో ఉన్నవారికి బీఎల్ఆర్ ఆధ్వర్యంలో వ్యాధినిరోధక శక్తిని పెంచే పదార్థాలను అందించారు. బీఎల్ఆర్ అభయహస్తం పేరుతో 11 రకాల వస్తువులతో కూడిన ప్యాక్‌ను మున్సిపాలిటీలో వార్డుల వారీగా పంపిణీ చేశారు.
కరోనా బాధితులకు బీఎల్ఆర్ అభయహస్తం - nalgonda news
బీఎల్ఆర్ అభయహస్తం పేరుతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో కరోనా బాధితులకు 11 రకాల వస్తువులను పంపిణీ చేశారు. కొవిడ్ బాధితులు ఇంట్లో ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా మృతుల కుటుంబాలకు తోచినంత నగదు సాయం చేశారు.
blr brothers distributed immunity boosters
కొవిడ్‌పై యుద్ధం చేస్తూ.. ఇంట్లో ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు సూచించారు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కరోనాతో పోరాడి చనిపోయిన హోంగార్డు శ్రీనివాస్ కుటుంబానికి రూ.లక్ష నగదు, ప్రైవేట్ టీచర్లకు రూ.5 లక్షలు ప్రకటించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.