విధినిర్వహణలో కర్తవ్యమే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు డీఐజీ తెలిపారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. డీఐజీ, ఎస్పీ ఏవీ రంగనాథ్ రక్త దానం చేశారు. పోలీసు అమరవీరులను ఈ సమాజం ఎప్పటికీ మరవదని అన్నారు.
నల్గొండలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన పోలీసులు
పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ పోలీసులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డీఐజీ, ఎస్పీ ఏవీ రంగనాథ్ రక్తదానం చేశారు. విధి నిర్వహణలో కర్తవ్యమే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసిన పోలీసులను ఈ సమాజం ఎప్పటికీ మరవదని అన్నారు.
నల్గొండలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన పోలీసులు
పోలీసు అమరవీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి పోలీసు పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్మద, డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం