కాంగ్రెస్, తెరాస పాలనలో నియోజకవర్గ అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. మాటలతో ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. వారి మాటలు నమ్మి ఓటేసి మోసపోవద్దని హితవు పలికారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థి రవి కుమార్ తరఫున డీకే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
'తెరాస, కాంగ్రెస్‌లు ఓటర్లను మభ్యపెట్టే యత్నం చేస్తున్నాయి.!' - dk aruna campaign in sagar by elections
నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. భాజపా అభ్యర్థి రవికుమార్ తరఫున పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రచారం నిర్వహించారు.
డీకే అరుణ, సాగర్ ఉపఎన్నికలు
నల్గొండ జిల్లా అనుముల మండలం పులి మామిడి, కే కే కాల్వ, కోసల మర్రి, అన్నారం, వెంకటాద్రి పాలెం, ముక్కామల గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ఉన్నత చదువులు చదివిన గిరిజన బిడ్డ రవికుమార్ నాయక్‌ను గెలిపిస్తే అభివృద్ధి భాజపా చూసుకుంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:'సాగర్'లో గెలిపిస్తే నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయం: కిషన్‌రెడ్డి