తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రైవేట్​ అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలి'

ప్రైవేట్​ ఉపాధ్యాయులు, అధ్యాపకులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీధర్​రెడ్డి డిమాండ్​ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో దీక్ష చేపట్టారు.

bjp deeksha in nalgonda district
'ప్రైవేట్​ అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలి'

By

Published : Oct 26, 2020, 7:20 PM IST

కొవిడ్ వల్ల ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులతో పాటు కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా డిమాండ్ చేసింది. పనులు లేక కుటుంబాలను పోషించుకోలేని దుస్థితిలో మాస్టార్లు ఉన్నారని భాజపా నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీధర్​రెడ్డి పేర్కొన్నారు.

ఈ మేరకు నిరాహార దీక్ష చేపట్టారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయం ఆవరణలో దీక్షకు దిగి.. ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు.

ఇదీ చూడండి.. 'మీరు ఎన్ని ఎక్కువ పంపిణీ చేస్తే మాకు అంత లాభం'

ABOUT THE AUTHOR

...view details