తెలంగాణ

telangana

ETV Bharat / state

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కంచర్ల

నల్గొండ జిల్లాలోని పలు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఆడ బిడ్డలకు పుట్టింటి వలె బతుకమ్మ చీరలతో... తెలంగాణ ప్రభుత్వం సారె పెడుతోందని అన్నారు. ఎన్నో అభివృద్ధి పథకాలు సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని తెలిపారు.

bathukamma sarees distribution in nalgonda district by mla kancharla bhupal reddy
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కంచర్ల

By

Published : Oct 9, 2020, 6:40 PM IST

ఆడ బిడ్డలు పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళేటప్పుడు పుట్టింటి వాళ్ళు ఎలాగైతే సారె పెడతారో.. తెలంగాణ ప్రభుత్వం అలాగే బతుకమ్మ చీరలతో సారె పెడుతోందని ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలోని ఒకటవ వార్డ్, గుండ్ల పల్లి, కాకుల కొండారం, పాతూరు, నర్సింగ్​బట్ల గ్రామాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

రాష్ట్రంలో ఆడపడుచులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు. గత ప్రభుత్వాలు, నాయకులు తలపెట్టని ఎన్నో అభివృద్ధి పథకాలు ముఖ్యమంత్రి కేసీఅర్ తీసుకువచ్చారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'నిరుపేదల మోములో బతుకమ్మ చీరలు ఆనందాన్ని నింపుతాయి'

ABOUT THE AUTHOR

...view details