మునుగోడులో అట్టహాసంగా బతుకమ్మ సంబురాలు - bathukamma_sambaraalu
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న తొమ్మిది రోజుల బతుకమ్మ సంబురాల్లో భాగంగా నేడు నల్గొండ జిల్లా మునుగోడులో అధికారికంగా జరుపుకున్నారు.
బతుకమ్మ సంబరాలు
నల్గొండ జిల్లా మునుగోడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారికంగా బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు ఆటపాటలతో ఆనందంగా జరుపుకున్నారు. అనంతరం ఊరి చివరనున్న చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.