తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్​ సభకు పూర్తైన ఏర్పాట్లు - నల్గొండ తాజా వార్తలు

నాగార్జునసాగర్​ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సాయంత్రం అనుములలో జరగనున్న సీఎం కేసీఆర్​ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 5 గంటలకు సభలో సీఎం ప్రసంగించనున్నారు.

anumula sabha
cm kcr sabha

By

Published : Apr 14, 2021, 10:59 AM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇవాళ నల్గొండ జిల్లా అనుముల మండల కేంద్రంలో జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 4 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా అనుముల సభాస్థలి వద్దకు చేరుకుంటారు.

అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంఛార్జి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. 5 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనుముల బహిరంగ సభకు వచ్చే ఫ్రజలు, కార్యకర్తలు, వాహనాల పార్కింగ్‌ కోసం పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇదీ చూడండి:ఇవాళ, రేపే సాగర్​ ఉపఎన్నిక ప్రచారానికి గడువు

ABOUT THE AUTHOR

...view details