తెలంగాణ

telangana

ETV Bharat / state

అరకొర వసతులతో అంగన్​వాడీ కేంద్రాలు

చిన్నారులకు, గర్భిణీలకు పౌష్ఠికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేసిన అంగన్​వాడీ వ్యవస్థ గాడి తప్పుతోంది. ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన కేంద్రాలు అరకొర వసతులతో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది.

అరకొర వసతులతో అంగన్​వాడీ కేంద్రాలు

By

Published : Aug 11, 2019, 2:47 PM IST

పేదరికంలో ఉండి పిల్లలకు, గర్భిణీలకు సరైన ఆహారం అందించకపోవటం వల్ల రోగాల బారినపడుతున్నారు. పౌష్ఠికాహారం అందించి ఆరోగ్యం కాపాడాలనే గొప్ప ఆలోచనతో ప్రభుత్వం అంగన్​వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. చాలా చోట్ల అవి సరైన వసతుల్లేక, పంచాయతీ, కమ్యూనిటీ హాల్స్, అద్దె భవనాల్లో, ఇరుకు గదుల్లో, కనీసం తాగునీరు, విద్యుత్ సౌకర్యం కూడా లేకుండానే నడుపుతున్నారు.

నల్లగొండ జిల్లా మునుగోడు, చండూరు మండలాల్లో 115 అంగన్​వాడీ కేంద్రాలు ఉండగా... కేవలం 19 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 48 కేంద్రాలు అద్దె భవనాల్లో, 46 కేంద్రాలు ఆయా గ్రామాల్లో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ భవనాల్లో కాలం వెల్లదీస్తున్నాయి. కొన్ని కేంద్రాలు మాత్రం శిథిలావస్థలో ఉన్న గదుల్లో నడుపుతున్నారు. అక్కడికి పిల్లల్ని పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి సొంత భవనాలకు నిధులు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.

అరకొర వసతులతో అంగన్​వాడీ కేంద్రాలు

ABOUT THE AUTHOR

...view details