నల్గొండ జిల్లాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ వాహనాలతో ఇసుక తరలిస్తున్నారు. దేవరకొండ మండలం తాటికోల్ గ్రామం నుంచి ఆస్పత్రి మరమ్మతుల కోసం ఇసుక తీసుకొస్తున్నట్లు సూపరిటెండెంట్ రాములు నాయక్ తెలిపారు.
ప్రాణాలు కాపాడే వాహనం... ఇసుక తెచ్చేందుకు పయనం
అంబులెన్స్‌లు ఉన్నది అపాయంలో ప్రాణాలు కాపాడేందుకే. అలాంటి వాహనాన్ని ఇసుక తెచ్చేందుకు ఉపయోగించారు వైద్య సిబ్బంది. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తాటికోల్ గ్రామం నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి మరమ్మతుల కోసం తరలిస్తున్నారు.
ఆస్పత్రి మరమ్మతుల కోసం 108లో ఇసుకను తరలిస్తున్న సిబ్బంది
అత్యవసర సమయంలో వాడాల్సిన వాహనాన్ని ఇలా ఇసుక కోసం వినియోగించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ విధంగా వ్యవహరించడంపై వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.