తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు వేసేందుకు సముద్రాలు దాటొచ్చాడు.. - america

ఎన్నికల్లో ఓటు వేయడానికి కొందరు ఆసక్తి చూడపం లేదు. అలాంటింది ఎన్నికలు వచ్చిన ప్రతీసారి అమెరికా నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓ ప్రవాస భారతీయుడు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

సముద్రాలు దాటొచ్చాడు..

By

Published : May 9, 2019, 2:11 PM IST

Updated : May 9, 2019, 5:46 PM IST

నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన అమరేందర్​రెడ్డి సాఫ్ట్​వేర్ ఇంజినీర్. పదిహేడేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. విదేశాల్లో స్థిరపడినా సొంతూరును మర్చిపోలేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తన సొంత గ్రామానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఆయన... ప్రాదేశిక ఎన్నికల కోసం నెల రోజులుగా ఇక్కడే ఉన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుంటేనే ప్రశ్నించే అధికారం ఉంటుందని ఎన్నారై అమరేందర్​రెడ్డి చెబుతున్నారు. ఓటు వేసేందుకు యువత ముందుకు రావాలని కోరుతున్నారు.

సముద్రాలు దాటొచ్చాడు..
Last Updated : May 9, 2019, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details