ఆగి ఉన్న లారీని ఢీకొన్న కంటైనర్ లారీ - container
అతివేగం, నిద్రమత్తు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. చౌటుప్పల్లో ఆగి ఉన్న లారీని కంటైనర్ లారీ ఢీకొట్టింది.
లారీని ఢీకొన్న కంటైనర్ లారీ
భువనగరి జిల్లా చౌటుప్పల్లో ఆగి ఉన్న లారీని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కంటైనర్ రోడ్డు మీద అడ్డంగా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు చేరుకొని సర్వీస్ రోడ్డు వెంట వాహనాలను పంపిస్తూ... కంటైనర్ను తొలగించారు. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు.