Clash between BRS and Congress in Nalgonda district: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకులపాడు గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. గ్రామంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన, నూతన శివాలయం గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి గాను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు శివాలయంలో ఎంపీ వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Clash between BRS and Congress: అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాదారం నుంచి ఇటుకులపాడు రోడ్డు దారుణంగా ఉందన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారంటూ విమర్శించారు. కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి రోడ్డు వెంటనే వేపిస్తానని చెప్పడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. వెంకట్‌రెడ్డి మాటలకు.. దైవకార్యానికి వచ్చి రాజకీయాలు మాట్లాడొద్దని బీఆర్ఎస్ శ్రేణుల అభ్యంతరం చెప్పారు.
Clash of Congress BRS Parties: అక్కడున్న వెంకట్‌రెడ్డితో బీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పార్టీల ఇరువర్గాలు బాహాబాహీకి దిగారు. దీంతో అక్కడి నుండి ఎంపీ కోమటిరెడ్డి బయలుదేరి వెళ్లిపోయారు. ఘర్షణ జరుగుతున్న సమయంలో నల్గొండ జిల్లా డీసీఎంఎస్ ఒట్టే జానయ్య యాదవ్ అక్కడే ఉన్నారు.