నల్గొండ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో మర్ళీ నాగార్జున సాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి 2 లక్షల 50 వేల క్యూసెక్కుల వరద రావడం వల్ల అప్రమత్తమైన అధికారులు సాగర్ జలాశయం14 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తారు. స్పిల్ వే ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గేట్లను ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి 11 సార్లు ఎత్తారు. ఎగువ నుంచి వరద పెరగడం వల్ల సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 2 లక్షల 50 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నందున అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు 14 క్రస్ట్ గేట్ల ఎత్తివేత
గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో... నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. అప్రమత్తమైన అధికారులు 14 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు 14 క్రస్ట్ గేట్ల ఎత్తివేత