నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం మద్దిమడుగులో పబ్బతి ఆంజనేయ స్వామి ఉత్సవాలను ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు గువ్వల బాలరాజు ప్రారంభించారు. ఆలయ అర్చకులు గువ్వల దంపతులిద్దరికి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
మద్దిమడుగును ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారుస్తాం: గువ్వల - మద్దిమడుగు ఆంజనేయ స్వామి వార్తలు
నల్లమల ప్రాంతంలో వెలసిన మద్దిమడుగు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా మార్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు గువ్వల బాలరాజు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం మద్దిమడుగులో పబ్బతి ఆంజనేయ స్వామి ఉత్సవాలను ప్రారంభించారు.
మద్దిమడుగును ప్రసిద్ధ దైవ క్షేత్రంగా మారుస్తాం: గువ్వల
గువ్వల దంపతులు హనుమద్గాయత్రి యజ్ఞోత్సవంలో పాల్గొన్నారు. నల్లమలలో వెలిసిన పబ్బతి మద్దిమడుగు హనుమాన్ ఆలయాన్ని అభివృద్ధి పరిచేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని బాలరాజు తెలిపారు. త్వరలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృష్ణానదీ తీరాన పెద్ద వంతెన వేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.