నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందారు. ఆ వ్యక్తి ఇంట్లో కుటుంబ సభ్యులు జ్వరంతో బాధపడుతుండడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ గ్రామ సర్పంచ్ కర్నె లక్ష్మీనారాయణ స్పందించారు.
కరోనాతో వ్యక్తి మృతి.. సర్పంచ్ అంత్యక్రియలు - నాగర్ కర్నూల్ జిల్లా తాజావార్తలు
కరోనాతో మృతిచెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు... నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి గ్రామ సర్పంచ్. మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో... పీపీఈ కిట్లు ధరించి పంచాయతీ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
కరోనాతో వ్యక్తి మృతి.. సర్పంచ్ అంత్యక్రియలు
వెంటనే ఆరోగ్య సిబ్బందితో మాట్లాడి పీపీఈ కిట్లను తెప్పించారు. ముందుగా ఆయన కిట్‌ను ధరించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు కదిలారు. ఆ తరువాత మృతుడి బంధువులు, పంచాయతీ సిబ్బంది సహకారం అందించారు. అందరూ కలిసి ట్రాక్టర్లో మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి: కరుణ చూపని ఆస్పత్రులు.. గాల్లో కలిసిన రెండు ప్రాణాలు