నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. బిజినపల్లి మండలంలోని భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు ఎమ్మార్వో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. భూ సమస్యలపై రెవెన్యూ కార్యాలయంలోని అధికారులు స్పందించకపోవడం వల్ల వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. రైతుల భూ సమస్యలను అధికారులు పట్టించుకోవడంలేదని.. పట్టాదారు పాసుపుస్తకాలు రాలేదని వాపోయారు. తమ సమస్యల పట్ల అధికారులకు ఎన్నో దఫాలుగా విన్నవించుకున్నా... పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించేంత వరకు ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు.
ఎమ్మార్వో కార్యాలయం ముందు వంటావార్పు - mro
నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు నిరసనకు దిగారు. కార్యాలయం ఎదుట వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.
వంటావార్పు