నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ మహిళా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడంతో తోటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకరిద్దరు విద్యార్థినిలు అస్వస్థతకు గురికావడంతో సహచర విద్యార్థులతో కలిపి 18 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేశారు. వారిలో ఇద్దరికీ కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధరించారు. దీంతో వారితో కలిసి ఉన్న 16 మంది విద్యార్థినులను ఐసోలేషన్లో ఉంచారు.
ఆ గురుకుల పాఠశాలలో నలుగురికి కరోనా - nagar kurnool corona cases update
రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో కరోనా కలవరపెడుతోంది. వైరస్ వ్యాప్తితో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉయ్యాలవాడ మహిళా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో నలుగురికి కొవిడ్ నిర్ధరణ అయింది.
జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాల తరగతి గదులతోపాటు ఆవరణలో శానిటేషన్ చేసి శుభ్రపరిచారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ శర్మన్ పాఠశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు విద్యార్థులు, అధైర్య పడవద్దని కలెక్టర్ సూచించారు. విద్యార్థులతో జాగ్రత్తగా వ్యవహరించాలని, అన్ని ఆరోగ్య పరిరక్షణ సూత్రాలు పాటించాలని ఆయన ఉపాధ్యాయులకు తెలిపారు. ప్రతి విద్యార్థి తోపాటు సిబ్బంది శానిటేషన్ చేసుకుంటూ మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా వైద్య పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
ఇదీ చూడండి :75 మందికి కరోనా పాజిటివ్