నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రంలో హైదరాబాద్ బస్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్-2 బస్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ బయలుదేరింది. మార్గ మధ్యలో తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సుకు సంబంధించిన బ్యాలెన్సింగ్ రాడ్ విరిగిపోయింది.
TSRTC: అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ ఏం చేశారంటే..! - nagarkurnool news
సజావుగా వెళ్తున్న ప్రయాణంలో ఒక్కసారిగా కుదుపు. బస్సు బ్యాలెన్స్ తప్పి అటు ఇటు వెళ్తోంది. ప్రయాణికులు ఏమి జరుగుతుందో తెలియక హాహాకారాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహించి... బస్సును అదుపులోకి తీసుకువచ్చి ఆపాడు. ఈ ఘటన నాగర్ కర్నూర్ జిల్లా తిమ్మాజీపేట మండలంలో చోటు చేసుకుంది.
సుమారు 55 కిలోమీటర్ల వేగంతో ఉన్న బస్సు... ఒక్కసారిగా అదుపుతప్పింది. బ్యాలెన్స్ తప్పి అటు ఇటు తిరుగుతూ... సుమారు 300 మీటర్ల దూరం వెళ్లింది. బస్సులోని ప్రయాణికులు ఏం జరిగిందో తెలియక ఒక్కసారిగా అరుస్తూ భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ జాన్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును అదుపులోకి తీసుకువచ్చి ఆపాడు. దీంతో వారందరూ ఏమైందో అని భయపడి... తేరుకునే లోపే డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు ఆపేశాడు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటన సమయంలో... బస్సులో సుమారు 58 మంది ప్రయాణికులు ఉన్నారు. చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ జాన్‌కు ప్రయాణికులు, స్థానికులు అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి:Saidabad rape case : సైదాబాద్ ఘటన.. రాజు ఎక్కడ తిరిగాడు?.. ఎలా వెళ్లాడు?