ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రతీ గడపకు తీసుకుపోవాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సూచించారు. నాగర్ కర్నూల్లో మర్రి జనార్దన్ రెడ్డి నిర్వహించిన నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాజరయ్యారు. సంక్షేమ ఫలాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని నేతలు కొనియాడారు. పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వవిప్లకు ఆర్టీసీ కార్మికులు అందించారు. అనంతరం నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వ విపులను సన్మానించారు.
'సంక్షేమ ఫలాలు ఇంటింటికి తీసుకెళ్లాలి'
నాగర్‌కర్నూల్‌లో నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌లు దామోదర్‌రెడ్డి, గువ్వల బాలరాజు హాజరయ్యారు.
TRS PARTY MEETING INNAGAR KARNOOL