ప్రచారం అడ్డిగింత
కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి ఎన్నికల ప్రచారం
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెరాస నేతల ప్రచారం జోరందుకుంది. అన్ని ప్రాంతాల ప్రజలకు చేరువయ్యేందుకు ఎంపీల తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచార బాధ్యతను నిర్వహిస్తున్నారు. కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి పర్యటించారు.
తెరాస ప్రచారం
కసిరెడ్డి ఎల్లికట్ట గ్రామానికి ప్రచారానికి వెళ్లగా ఓ వర్గం వారు ఆయనను అడ్డుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి రావాలని నినాదాలు చేశారు. ఉద్రిక్తత నెలకొంది. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దారు. అనంతరం ఎమ్మెల్సీ గ్రామంలో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు.
ఇదీ చదవండి :ఫేస్బుక్లో మరో పోస్ట్.. స్పందించిన సీఎంఓ