తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలియో చుక్కలు వేసేందుకు వెళుతుంటే పులి ఎదురొచ్చింది! - nagarkurnool news

పల్స్​ పోలియో కార్యక్రమానికి వాహనంలో వెళ్తున్న సిబ్బందికి.. పెద్దపులి ఎదురైంది. భయాందోళనకు గురైన సిబ్బంది.. అది వెళ్లేంత వరకు అటవీ మధ్యలోనే ఉండిపోయారు. పెద్దపులి సంచారాన్ని తమ చరవాణుల్లో చిత్రీకరించారు.

Tiger encounters staff on their way to 'Pulse Polio' event at nagarkurnool district
'పల్స్​ పోలియో' కార్యక్రమానికి వెళ్తున్న సిబ్బందికి ఎదురైన పెద్దపులి..

By

Published : Jan 31, 2021, 8:33 PM IST

Updated : Jan 31, 2021, 10:16 PM IST

నల్లమలలో పల్స్ పోలియో కార్యక్రమానికి వెళ్తున్న వైద్య సిబ్బందికి పెద్దపులి ఎదురైంది. భయాందోళనకు గురైన సిబ్బంది.. వాహనాన్ని అక్కడే నిలిపేసి.. పులి సంచారాన్ని సెల్​ఫోన్​లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తోంది.

నాగర్​కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామ పరిధిలోని చెంచు పెంటలో.. చిన్నారులకు పోలియో చుక్కలను వేసేందుకు వైద్య సిబ్బంది ఓ వాహనంలో వెళ్లారు. కొంత దూరం వెళ్లేసరికి... సంగిడిగుండాల వద్ద రహదారిపై తిరుగుతూ పెద్దపులి తారసపడింది. ఒక్కసారిగా భయాందోళనకు గురైన సిబ్బంది.. వాహనాన్ని కొద్దిసేపు అక్కడే నిలిపేశారు. పెద్దపులి సంచారాన్ని చరవాణుల్లో చిత్రీకరించారు. పులి వెళ్లేంత వరకు వేచిచూసి.. అనంతరం పల్స్​ పోలియో కార్యక్రమానికి హాజరయ్యారు.

'పల్స్​ పోలియో' కార్యక్రమానికి వెళ్తున్న సిబ్బందికి ఎదురైన పెద్దపులి..

ఇవీచూడండి:'వారందరికీ అందేంతవరకు పల్స్​ పోలియో కార్యక్రమం'

Last Updated : Jan 31, 2021, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details