తెలంగాణ

telangana

పెళ్లింట్లో దొంగతనం... సుమారు 4లక్షల చోరీ...

By

Published : Nov 12, 2019, 9:45 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో దొంగతనం జరిగింది. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చొరబడి ఏడున్నర తులాల బంగారం, 25 తులాల వెండి, రూ.80వేల నగదు దోచుకెళ్లారు.

నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రంలో దొంగలు హల్​చల్​

నాగర్​కర్నూల్​ పట్టణంలో దొంగలు హల్​చల్​ చేశారు. హౌసింగ్ బోర్డు బీసీ కాలనీలో తాళం వేసున్న ఓ ఇంటిని కొల్లగొట్టారు. ఏడున్నర తులాల బంగారం, 25తులాల వెండి, రూ.80వేల నగదు దోచుకెళ్లారని బాధితులు వాపోతున్నారు. వారం కిందట ఇంట్లో పెళ్లి జరిగింది. నిన్న సాయంత్రం ఇంటికి తాళం వేసి అందరూ ఊరెళ్లారు. ఇవాళ ఉదయం లైటింగ్​ తీయడానికొచ్చిన వాళ్లు తాళం విరిగిపోయి ఉండడం చూసి యజమానికి సమాచారం అందించారు. బాధితులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఇన్​ఛార్జి ఎస్పీ అపూర్వ రావు, డీఎస్పీ మోహన్​ రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు. క్లూస్​టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా నగరంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రంలో దొంగలు హల్​చల్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details