అంకితభావంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శుల పైనే ఉంటుందన్నారు నాగర్కర్నూల్ జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్. జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన 266 మంది ఉద్యోగులకు ఒకరోజు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీపీఓ సురేశ్ మోహన్, డీఈఓ గోవిందరాజులు హాజరయ్యారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల అభివృద్ధికి ముఖ్య భూమిక పోషించాలని డీపీఓ కోరారు. అంకితభావంతో పనిచేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కార్యదర్శులపైనే ఉంటుందని దిశానిర్దేశం చేశారు.
పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఎంపికైన పంచాయతీ కార్యదర్శులకు ఒకరోజు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు.
పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం