నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట గ్రామ సమీపంలో నాగూర్బీ అనే మహిళ మేకల దొడ్డిలోకి కొండ చిలువ దూరి అందులో ఒక మేక పిల్లను మింగేసింది. ఇది గమనించిన నాగూర్బీ మేకల దొడ్డిలో ఉన్న కొండ చిలువను చూసి కేకలు వేసింది. చుట్టు పక్కల ఉన్నవారు హడావుడిగా అక్కడికి చేరుకున్నారు. మేక పిల్లను మింగినట్టుగా స్థానికులు గుర్తించి సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. వారు కొండచిలువను అడవిలోకి తీసుకెళ్లి వదిలిపెట్టారు. రోజురోజుకు అడవిలో జంతువులు పెరుగుతున్నందున తమ అనుమతి లేకుండా ఎవరూ అడవిలోకి వెళ్లకూడదని దోమలపెంట రేంజర్ వాణి ఆదేశాలు జారీ చేశారు. నష్టపోయిన మేకల కాపరి నాగూర్బీకి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు.
మేకపిల్లను మింగేసిన కొండచిలువ - snake
నాగర్‌కర్నూల్ జిల్లా ఈగలపెంట గ్రామ సమీపంలో కొండచిలువ కలకలం రేపింది. ఓ మహిళకు చెందిన మేకలదొడ్డిలోకి దూరి మేకపిల్లను మింగేసింది. అటవీ అధికారుల ఆదేశాల మేరకు స్థానికులు కొండచిలువను అడవిలో వదిలేశారు.
మేకపిల్లను మింగేసిన కొండచిలువ