తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సర్పంచ్​ని పరామర్శించిన ఎస్సీ,ఎస్టీ కమిషన్​ సభ్యుడు

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వంగూరు మండలం రంగాపూర్ గ్రామ సర్పంచ్​ చింత ఝాన్సీని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చిలకమర్రి నరసింహం పరామర్శించారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సర్పంచ్​ని పరామర్శించిన ఎస్సీ,ఎస్టీ కమిషన్​ సభ్యుడు
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సర్పంచ్​ని పరామర్శించిన ఎస్సీ,ఎస్టీ కమిషన్​ సభ్యుడు

By

Published : Sep 25, 2020, 10:46 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చిలకమర్రి నరసింహం పర్యటించారు. ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వంగూరు మండలం రంగాపూర్ గ్రామ సర్పంచ్​ చింత ఝాన్సీని పరామర్శించారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే గ్రామ సర్పంచిగా ఎన్నికైన మహిళపై వేధింపులకు పాల్పడడం చాలా బాధాకరమన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చాలని అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నత స్థాయి అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు. న్యాయంగా ఉండేవారికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందని, దుర్వినియోగం చేసే వారిని కఠినంగా శిక్షించే అధికారం ఉంటుందని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్ కుమార్, తహసీల్దారు రాంరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి:సమస్యల పరిష్కారం కోసం మంత్రిని కలిసిన టీఎన్టీవో నేతలు

ABOUT THE AUTHOR

...view details