తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్పంచ్​ మానవత్వం.. కరోనా మృతదేహానికి అంత్యక్రియలు - కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన నాగులపల్లి సర్పంచ్​

కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు ఓ సర్పంచ్​. పోలీసులు, గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆపత్కాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.

కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్​
కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్​

By

Published : May 10, 2021, 10:14 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా కోడెర్ మండలం నాగులపల్లిలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. చివరకు వైరస్ సోకి చనిపోయాడు. కొవిడ్​ మరణం కావడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా గ్రామ సర్పంచ్ వెంకటస్వామి, పోలీసులు కలిసి గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో కొవిడ్​ జాగ్రత్తలు తీసుకుంటూ అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఈ సందర్భంగా కొవిడ్​ వ్యాప్తి అధికంగా ఉన్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని పోలీసులు సూచించారు.

ఇదీచూడండి:కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details