నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమలలోని ఫరహాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గద్వాల జిల్లా దౌదార్పల్లి, చెన్నమోనిపల్లి గ్రామాలకు చెందిన కుటుంబాలు.. దైవ దర్శనానికి శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన సంభవించింది. ఫరహాబాద్ చౌరస్తా వద్దకు రాగానే.. మలుపు వద్ద బొలేరో వాహనం బోల్తా పడింది.
దైవదర్శనం చేసుకొని వెళ్తుండగా ప్రమాదం.. ఒకరి మృతి - రోడ్డు ప్రమాద వార్తలు
దైవ దర్శనానికి వెళ్లి తిరిగొస్తున్న భక్తులను ప్రమాదం కబలించింది. నాగర్కర్నూల్ జిల్లా నల్లమలలోని ఫరహాబాద్ వద్ద జరిగిన పోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమించింది. క్షతగాత్రులను హైదరాబాద్కు తరలించారు.
ROAD ACCIDENT TO BOLLERO AT NALLAMA
ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. నవీన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్లను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.