నాగర్ కర్నూల్ జిల్లాలోని కొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల విస్తారంగా వర్షం కురిసింది. జిల్లాలోని తాడూరు, తెలకపల్లి, బిజినేపల్లి, నాగర్ కర్నూల్ తదితర మండలాల్లో ఓ మోస్తారుగా వర్షం పడింది. అచ్చంపేట నియోజకవర్గంలోని పదరా మండలంలో సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి చిట్లంకుంట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఆంజనేయులు ఇల్లు కూలిపోయింది.ఫలితంగా ఇంట్లోని వస్తువులు, బియ్యం అంతా తడిసిపోయాయి. బాధితుడికి ఇద్దరు చిన్నపిల్లలు ఉండటం వల్ల తలెక్కడ దాచుకోవాలని ఆందోళన చెందాడు. వెంటనే ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం చేయాలని కోరాడు.
వాన భీభత్సంతో కూలిన ఇల్లు.. అర్థిస్తున్న కుటుంబం - కొన్ని చోట్ల భారీగా,
కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయమైన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.
వాన భీభత్సం..కూలిన ఇల్లు.. అర్థిస్తున్న కుటుంబం