నాగర్కర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. అకాల వర్షంతో వరి పైరు దెబ్బతింది. ఈదురు గాలులకు పంట మొత్తం నేలకొరిగింది. ఆయా గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లోని వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఈదురు గాలులతో వడగళ్ల వాన.. తీవ్ర పంట నష్టం - నాగర్ కర్నూల్ జిల్లా తాజా వార్తలు
నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో సాయంత్రం వేళ ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. అకాల వర్షం కారణంగా దాదాపు 200 ఎకరాల్లోని వరి పంటకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్త చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో వడగళ్ల వాన
పంట చేతికి వచ్చే దశలో అకాల వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది కష్టమంతా వృథాగా పోయిందని వాపోయారు. ఈదురు గాలుల ప్రభావానికి తిమ్మాజిపేట, పుల్లగిరి ప్రాంతాల్లో స్తంభాలు నేలకొరిగి వైర్లు తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొంది.
ఇదీ చదవండి:ఎంఈవో రాజయ్య మృతి పట్ల కేటీఆర్ సంతాపం