రాష్ట్రంలో జరిగిన మినీ పుర పోరు ఓటింగ్ ముగిసింది. పెద్ద సంఖ్యలో ప్రజలు కొవిడ్ నింబంధనలను పాటిస్తూ.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రముఖులు కుటుంబంతో సహా కలిసి వచ్చి తమ ఓటు వేశారు.
మినీ పుర ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు - mini pura election latest news
మినీ పుర పోరు ఎన్నికల ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన ఎన్నికలో రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పుర ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన పుర ఎన్నికల్లో ఎంపీ రాములు దంపతులు, శాసన సభ్యులు గువ్వల బాలరాజు దంపతులు, మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 60.05 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:పోలింగ్ కేంద్రం వద్ద తోపులాట.. రంగంలోకి పోలీసులు