తెలంగాణ

telangana

ETV Bharat / state

కొబ్బరి బోండాల కత్తితో గొంతు కోసుకున్న వ్యక్తి - నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కొబ్బరి బోండాల కత్తితో గొంతు కోసుకున్న వ్యక్తి

అప్పటికి వరకు బంధువుతో మాట్లాడుతూ బాగానే ఉన్నాడు. ఒక్కసారిగా కొబ్బరి బోండాలు నరికే కత్తి తీసుకొని గొంతు కోసుకున్నాడో వ్యక్తి. విషయం గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు.

suicide attempt
కొబ్బరి బోండాల కత్తితో గొంతు కోసుకున్న వ్యక్తి

By

Published : Jan 12, 2020, 2:52 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో మెడ కోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఇతను బిజినాపల్లి మండల కేంద్రానికి చెందిన నిజాం అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల కారణంతోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ఇప్పటికే పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఉదయం పట్టణంలోని రైతుబజార్ వద్ద కొబ్బరి బోండాల వ్యాపారం చేసుకునే తన బంధువు వద్దకు వెళ్లి... కత్తి తీసుకొని గొంతు కోసుకున్నాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోగా... స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిజాం పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కొబ్బరి బోండాల కత్తితో గొంతు కోసుకున్న వ్యక్తి

ఇవీ చూడండి: బస్తీమే సవాల్: ఖమ్మం గుమ్మంలో సమస్యల విలయతాండవం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details