ఎండ దృష్ట్యా ఉదయమే ఓటుకి ప్రాధాన్యం ఇచ్చిన ప్రజలు
నాగర్‌కర్నూల్ జిల్లాలో 7 జడ్పీటీసీ, 88 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం నుంచే ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో తొలి విడత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మొత్తం 7 జడ్పీటీసీ, 88 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. నాగర్ కర్నూల్, తిమ్మాజిపేట, బిజినాపల్లి, కోడేరు, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లో ఎన్నికలు కొనసాగుతుండగా... రెండు లక్షల 39 వేలు 629 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 91 ఎంపీటీసీ స్థానాలుండగా... అందులో రెండు ఏకగ్రీవం. నాగర్‌కర్నూల్ మండలంలోని గగలపల్లి ఎంపీటీసీ స్థానానికి సంబంధించి తెరాస అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి 10 లక్షల రూపాయలు ఇచ్చారనే ఆరోపణతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలింగ్‌ను నిలిపివేసింది. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయమే పెద్దఎత్తున ప్రజలు ఓటుహక్కు వినియోగించుకోడానికి కేంద్రాలకు చేరుకున్నారు.