పర్యటకులు, ప్రకృతి ప్రేమికులు, భక్తులకు నల్లమల అందాలను మరింత దగ్గరగా చేర్చేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని నాగర్‌కర్నూలు జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్ తెలిపారు. నాగర్‌కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతం పదిర మండలం మద్దిమడుగు, కృష్ణా నది పరవాహక ప్రాంతాలను అటవీశాఖ సిబ్బందితో కలిసి పర్యటించారు. మద్దిమడుగు నుంచి మర పడవ ద్వారా గున్నరేవు, పెద్ద రేవులను ఆయన పరిశీలించారు.
ప్రకృతి ప్రేమికుల కోసం మరింత అందంగా నల్లమల అడవులు!
నాగర్‌కర్నూలు జిల్లా మద్దిమడుగు, కృష్ణా నది పరవాహక ప్రాంతాలను అటవీశాఖ సిబ్బందితో కలిసి అటవీశాఖ అధికారి కిష్టగౌడ్ పర్యటించారు. పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు, భక్తుల కోసం నల్లమలను మరింత అందంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.
ప్రకృతి ప్రేమికుల కోసం మరింత అందంగా నల్లమల అడవులు!
పడవ ద్వారా వెళ్తూ పర్యటకులను ఆకర్షించే పలు ప్రదేశాలను గుర్తించినట్లు కిష్టగౌడ్ తెలిపారు. కృష్ణా నది తీరాన రేపు వరకు వెళ్లే రెండున్నర కిలోమీటర్ల కాలినడక ప్రయాణం... ప్రకృతి ప్రేమికులు ఆస్వాదించే విధంగా ఉంటుందన్నారు. మద్దిమడుగుకు వచ్చే భక్తులకు బోటింగ్, కాలినడక ప్రాంతం ఇవన్నీ ఒక ప్యాకేజీలో రూపొందించేందుకు కృషి చేస్తానని.. ఇందుకు కావాల్సిన అవకాశాలను పరిశీలిస్తామని ఆయన వెల్లడించారు.
ఇవీ చూడండి:రవీంద్ర భారతి వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం