ఎస్సీ కోటా కింద రిజర్వ్ అయిన నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి తెరాస తరఫున మాజీ మంత్రి పోతుగంటి రాములు, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ మల్లు రవి, భాజపా అభ్యర్థిగా బంగారు శ్రుతి తో సహా మొత్తం 11 మంది పోటీ పడ్డారు. కాంగ్రెస్, తెలుగుదేశం తప్ప మరోపార్టీ గెలువని నియోజకవర్గంలో తెరాస గెలుస్తుందా...? సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందా... కొత్తగా భాజపా పాగా వేస్తుందా? అనే విషయం తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే!
నాగర్కర్నూల్లో గెలుపెవరిది? - నాగర్కర్నూల్లో గెలుపెవరిది?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న లోక్సభ నియోజకవర్గం నాగర్ కర్నూల్. మరి కందనూలు కోటపై ఎగరబోయే జెండా ఎవరిది? కారు...సారు.... 16 అంటూ ప్రజల్లోకి వెళ్లిన గులాబీ దళానిదా? లేక కాంగ్రెస్దా? మరి జనం ఎవరిని గెలిపించబోతున్నారు?
nagar