తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిర్దేశిత గడువులోగా రైతు వేదిక నిర్మాణాలు పూర్తిచేయాలి' - రైతు వేదికల నిర్మాణాలపై నాగర్​కర్నూల్​ కలెక్టర్​ ఆరా

నాగర్​ కర్నూల్​ జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్​ యాస్మిన్​ భాష బిజినేపల్లి, మహాదేవునిపేట, పాలెం గ్రామాల్లో పర్యటించారు. రైతు వేదిక నిర్మాణాలు, ఆస్తుల నమోదులో జాప్యంపై అధికారులు, గుత్తేదార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువులోగా పూర్తిచేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

nagarkurnool collector
'నిర్దేశిత గడువులోగా రైతు వేదిక నిర్మాణాలు పూర్తిచేయాలి'

By

Published : Oct 7, 2020, 4:01 PM IST

రైతు వేదికల నిర్మాణాలను, అంతర్జాలంలో ఆస్తుల వివరాలను పక్కాగా నమోదుచేయాలని నాగర్​ కర్నూల్​ జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్​ యాస్మిన్​ భాష అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

నాగర్​కర్నూల్​ జిల్లా బిజినాపల్లి మండలంలోని బిజినేపల్లి, మహాదేవునిపేట, పాలెం గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలను పరిశీలించారు. ఆన్​లైన్​లో ఆస్తుల నమోదు ప్రక్రియను సంయుక్త కలెక్టర్​ మనుచౌదరితో కలిసి పరిశీలించారు. మహాదేవునిపేటలో ఆస్తుల నమోదు ప్రక్రియలో జాప్యంపై గ్రామ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిజినేపల్లి, పాలెం గ్రామాల్లో రైతువేదికల నిర్మాణాల్లో పురోగతి లేకపోవడం వల్ల సంబంధిత అధికారులు, గుత్తేదారులపై ఇంఛార్జి పాలనాధికారి అసహనం వ్యక్తం చేశారు. ఇసుక కొరత ఉందని.. గుత్తేదారులు పాలనాధికారి దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ కట్టడాలకు ఇసుక దొరకకపోవడమేంటన్న కలెక్టర్​.. రెవెన్యూ, పోలీస్​ అధికారుల సమన్వయంతో ఇసుక సరఫరాలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు.

ఇవీచూడండి:ప్రభుత్వ సంస్థలే రైతుల వద్దకు వస్తాయి: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details