తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాజెక్టు నిర్మాణం కోసం సహకరించండి: కలెక్టర్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం కోసం మరో 83 ఎకరాలు భూమి అవసరం ఉందని... ప్రజలు, రైతులు దీనికి సహకరించాలని నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్ శర్మన్ కోరారు. ఎల్లూరు గ్రామం వద్ద ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.

nagarkurnool collector visit palamuru ranga reddy irrigation project
ప్రాజెక్టు నిర్మాణం కోసం సహకరించండి: కలెక్టర్

By

Published : Feb 17, 2021, 4:36 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి ప్యాకేజీ పనులను జిల్లా కలెక్టర్ శర్మన్, ప్రాజెక్టు అధికారులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ప్రాజెక్టు కోసం ఇంకా 83 ఎకరాల భూమి అవసరమున్న నేపథ్యంలో... భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు అధికారులు పరిశీలించారు.

భూమి అవసరం ఉన్న చోట మ్యాప్ ద్వారా పరిశీలించారు. మార్చి వరకు 83 ఎకరాలు భూమిని సేకరించి... ప్రభుత్వానికి అప్పజెప్పాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. దీనికి రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం ప్రాజెక్టు ఆవరణలో జిల్లా కలెక్టర్, అధికారులు మొక్కలు నాటారు.

ఇదీ చూడండి:కోటి వృక్షార్చనలో కేటీఆర్ ఫ్యామిలీ

ABOUT THE AUTHOR

...view details