తెలంగాణ

telangana

'నాగర్​ కర్నూల్​ అన్నపూర్ణ జిల్లాగా విలసిల్లుతోంది'

By

Published : Apr 21, 2020, 5:48 PM IST

పుష్కలమైన నీటి వనరులు ఉండటం వల్ల నాగర్​కర్నూల్​ జిల్లా గతేడాది కంటే 291 శాతం అధికంగా వరి దిగుబడి సాధించిందని జిల్లా కలెక్టర్ శ్రీధర్​ అన్నారు. పలు మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Nagarkurnool collector sridhar sudden visit to grain purchase centers
నాగర్​ కర్నూల్​లో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

నీటి వనరులు పుష్కలంగా ఉండటం వల్ల నాగర్​కర్నూల్​ జిల్లా అన్నపూర్ణ జిల్లాగా విలసిల్లుతోందని కలెక్టర్ శ్రీధర్​ అన్నారు. జిల్లా రైతులు గతేడాది కంటే అధిక వరి దిగుబడి సాధించారని కొనియాడారు.

తెల్కపల్లి, పెద్దకొత్తపల్లి మండల కేంద్రాల్లో ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు తమ ధాన్యాన్ని తేమ లేకుండా చూసుకోవాలని కలెక్టర్​ సూచించారు.

జిల్లా వ్యాప్తంగా 228 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు, అధికారులు భౌతిక దూరం పాటించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details