తెలంగాణ

telangana

ETV Bharat / state

గంజాయి మొక్కలు, సారా స్థావరాలు ధ్వంసం చేసిన పోలీసులు - nagar kurnool police destroyed cannabis cultivation

నల్లమల ప్రాంతంలో రోజురోజుకు గంజాయి పెంపకం, నాటుసారా తయారీ పెరిగిపోతోంది. అక్రమ వ్యాపారుల ఆటకట్టించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మూకుమ్మడిగా దాడి చేసి గంజాయి మొక్కల్ని, సారా స్థావరాలను ధ్వంసం చేశారు.

nagar kurnool police destroyed cannabis cultivation
నాగర్​ కర్నూల్​లో గాంజా పెంపకం

By

Published : Jul 17, 2020, 2:35 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్​ మండలం లక్మాపూర్​ తండాలో పత్తిలో అంతరపంటగా గంజాయి మొక్కలు సాగుచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని 350 గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారు.

అదే తండాలో ఉన్న నాటుసారా స్థావరాలపై పోలీసులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. సారా బట్టీలను ధ్వంసం చేసి, 50 కిలోల బెల్లం, 6 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రాగానే సారా కాస్తున్న నిందితులు పరారయ్యారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, వీలైనంత త్వరగా వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలిస్తామని సీఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details