పదో తరగతి చదువుతున్న తన కూతురు శ్రుతిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి సర్కారు బడులపై ప్రజలకు భరోసా కల్పించాడు నాగర్కర్నూల్ ఎంపీడీఓ రామ్మోహన్ రావు. ఈ రోజుల్లో ప్రతీఒక్కరూ.. తమ పిల్లల్ని అప్పులు చేసి మరీ ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారన్నారు.
ప్రభుత్వ టీచర్లు అన్ని విభాగాల్లో శిక్షణ పొంది, సంపూర్ణ విద్యావంతులు కాబట్టే.. తన కూతురు శ్రుతిని చేర్పించామని ఎంపీడీఓ తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు స్వయంగా వచ్చి అడ్మిషన్ తీసుకోవడమే కాకుండా తరగతి గదిలో కూతురిని కూర్చోబెట్టి ఆదర్శంగా నిలిచారు.
'ప్రభుత్వ పాఠశాలల్లోనే నిపుణులైన ఉపాధ్యాయులు'