కరోనా విజృంభిస్తున్న వేళ ముందస్తు చర్యల్లో భాగంగా పలు కాలనీల్లో ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కలెక్టర్ శ్రీధర్ రసాయన మందులను పిచికారీ చేశారు. నాగర్ కర్నూల్ పట్టణంలోని పదోవార్డు రామాలయం వీధిలో స్ప్రే, బ్లీచింగ్ పౌడర్‌ను వెదజల్లారు. ఇటీవల పట్టణంలో ఓ వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్ రావడం వల్ల ఆ కాలనీని రెడ్‌జోన్‌గా ప్రకటించారు.
రసాయనాలను స్ప్రే చేసిన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ - స్ప్రే, బ్లీచింగ్ పౌడర్
కొవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఆ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కలెక్టర్ శ్రీధర్ పలు కాలనీల్లో రసాయన మందులను స్ప్రే చేశారు.
మందులను స్ప్రే చేసిన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్
ఆ ప్రాంతాన్ని వారు పరిశీలించారు. ఆ వీధి ప్రజలకు కావల్సిన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్కడవారు బయటకు రాకుండా చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించడం వల్ల కరోనా వైరస్ నుంచి తమను తాము రక్షించుకోగలమన్నారు. అనవసరంగా ఇంట్లో నుంచి ఎవరూ కూడా బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :సరిహద్దులో ఓ వ్యక్తిని చంపేసిన మావోలు