నాగర్ కర్నూలు జిల్లా తాండూరు మండలం ఆకు నెల్లికుదురు శివారులో దుందుభి నదిపై 5 కోట్ల వ్యయంతో భారీ చెక్ డ్యామ్ నిర్మాణానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఈ రోజు చెక్ డ్యాం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన చెక్ డ్యామ్ డిజైన్ పరిశీలించి, చెక్ డ్యామ్ సైట్ ప్రాంతాన్ని పర్యవేక్షించారు.
చెక్ డ్యాం నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
నాగర్ కర్నూల్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో మొత్తం 10 భారీ చెక్ డ్యాంలు నిర్మించబోతున్నట్లు తెలిపారు.
చెక్ డ్యాం నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపనచెక్ డ్యాం నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
చెక్ డ్యామ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో విస్తరించి ఉన్న 33 కిలోమీటర్ల నది పొడవున 10 భారీ చెక్ డ్యాములు నిర్మించబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఉపనదులకు చెక్ డ్యామ్‌లను నిర్మించి రైతులకు సాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:గొర్రెకుంట బావి ఘటనలో వీడిన మిస్టరీ.. ప్రేమ వ్యవహారమే కారణమా?