తాగడానికి గుక్కెడు మంచినీళ్లు దొరకక ప్రజలు ఏడుస్తుంటే... అధికారుల నిర్లక్ష్యంతో ఎన్నో వేల లీటర్ల నీరు వృథాగా పోతోంది. నాగర్ కర్నూలు జిల్లా కొండూరు గ్రామం వద్ద మిషన్ భగీరథ పైప్లైన్లు పగిలి ఫౌంటైన్ని తలపించింది. రోజూ తాగునీటి కోసం ఎంతో దూరం నడిస్తున్నామని ఇలా నీరు వృథాగా పోతుంటే చాలా బాధగా ఉందని గ్రామస్థులు వాపోతున్నారు. పైపులైన్లు పగిలాయని అధికారులకు విన్నవించినా స్పందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు వృథాగా పోవడం చూడలేని కొందరు గ్రామస్థులు పంటపొలాలకు నీటిని వదులుకున్నారు.
ఫౌంటెన్ని తలపిస్తోన్న పగిలిన మిషన్ భగీరథ పైపులైన్లు - WATER
అసలే ఎండాకాలం... ఆపై తాగునీటి కష్టాలు... నీటి కోసం కిలోమీటర్ల మేర నడిచి ఎండలో విలవిల్లాడుతుంటే అధికారుల నిర్లక్ష్యంతో పైపులు పగిలి తాగునీరు వృథాగా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫౌంటేన్ని తలపిస్తోన్న పగిలిన మిషన్ భగీరథ పైపులైన్లు