తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమస్యల పరిష్కారానికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉంది' - తెలంగాణ వార్తలు

నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర ఉపాధ్యాయ మహాసభలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. పీఆర్సీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు. చట్టసభల్లో బీసీలకు, మహిళలకు తెరాస అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.

Minister Srinivas Goud attended the state teachers' meeting held at Nagar Kurnool district
'సమస్యల పరిష్కారానికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉంది'

By

Published : Feb 27, 2021, 10:46 PM IST

విద్యారంగ సమస్యల పరిష్కారానికి తెరాస ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర ఉపాధ్యాయ మహాసభలకు ఆయన హాజరయ్యారు.

అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి అన్నారు. పీఆర్సీ వంటి సమస్యల పరిష్కారంలో కేంద్ర నిర్ణయాలతో కొంత ఇబ్బంది తలెత్తిందన్నారు. చట్టసభల్లో బీసీలకు, మహిళలకు తెరాస అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో తమకు సహకరించాలని కోరారు.

రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడం లేదని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ప్రత్యర్థులు కూడా అభినందించాల్సిందే: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details