నియంత్రిత సాగుకు రైతులు సంపూర్ణ మద్దతు తెలిపారని.. కానీ విపక్షాలు దీనిని రాజకీయం చేశాయని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ గ్రామంలో రైతు వేదిక భవనం, కల్వకుర్తి పురపాలిక పరిధిలోని పలు అభివృద్ధి పనులు, వెల్దండ మండలం కొట్ర గ్రామంలో రైతు వేదిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రైతు వేదికలు సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచన అని.. ఈ వేదికలు రైతులను సంఘటితం చేసేందుకు ఉపయోగపడతాయని మంత్రి అన్నారు.
రైతుబంధు సాయం అందిస్తున్నాం
కనీస మద్దతు ధర రైతులకు దక్కాలనేదే కేసీఆర్ ముఖ్య ఉద్దేశమని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుబంధు కింద రూ. 7,515 కోట్లను 61 లక్షల మంది ఖాతాలో జమ చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు తెరాస అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.