నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఆసుపత్రిని మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రారంభించారు. 'అమెరికన్ తెలంగాణ సొసైటి, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ' అసోసియేషన్ వారు మారుమూల ప్రాంతంలో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
'సహాయం అందించడానికి దాతలు మరింత ముందుకు రావాలి' - Minister Niranjan Reddy covid Hospita
నాగర్ కర్నూల్ జిల్లాలో ఏన్నారైలు ఏర్పాటు చేసిన కొవిడ్ ఆసుపత్రిని మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రారంభించారు. ఈ కష్ట సమయంలో సహాయం అందించడానికి దాతలు మరింత ముందుకు రావాలని సూచించారు.
'సహాయం అందించడానికి దాతలు మరింత ముందుకు రావాలి'
ఆసుపత్రి ఏర్పాటు చేసిన ఎన్నారై సభ్యులతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. కొవిడ్ మూడో దశ నేపథ్యంలో ఎన్జీవోలు, దాతలు మరింతగా సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిభంధనలు పాటించాలని.. ఏవిధమైన సహయం కావాలన్నా తనను సంప్రదించాలన్నారు.
ఇదీ చూడండి: Balakrishna: శ్రీకాంత్‌కు బాలయ్య 'స్వీట్ వార్నింగ్'