దళారి వ్యవస్థను రూపుమాపాలంటే మహిళలు ముందుకు రావాలని కోరారు సెల్ఫ్ సంస్థ సీఈఓ పసుమి బసు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మాచినేనిపల్లిలో బతుకమ్మ మహిళ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె హాజరయ్యారు. మామిడి సాగు, కొనుగోలుపై మహిళలకు అవగాహన కల్పించారు. మామిడి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకొని అతివలు ఆర్థికంగా ఎదగాలని ఆకాక్షించారు. మామిడిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తే.. లాభదాయకంగా ఉంటుందని సూచించారు.
దళారి వ్యవస్థను రూపుమాపాలంటే మహిళలు ముందుకురావల్సిందే! - కొల్లాపూర్
మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాక్షించారు సెల్ఫ్ సంస్థ సీఈఓ పసుమి బసు. నాగర్కర్నూల్ జిల్లా మాచినేనిపల్లిలో మహిళా రైతులకు ఆమె అవగాహన కల్పించారు.
మహిళా రైతులకు ఆమె అవగాహన