నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద నిర్మించిన మహాత్మగాంధీ ఎత్తిపోతల పథకం మొదటి పంపు వద్ద గోడల పగుళ్ల ద్వారా పంప్‌హౌస్‌లోకి నీరు చేరి మోటార్లు పూర్తిగా మునిగిపోయాయి. నీరు రావడం వల్ల పంప్‌హౌస్‌లో పనిచేస్తున్న సిబ్బంది పరుగులు తీశారు.
ఎల్లూరు సర్జ్‌పూల్ పంప్‌హౌస్‌లోకి చేరిన నీరు, మునిగిన మోటార్లు
మహాత్మగాంధీ ఎత్తిపోతల పథకం మోటర్లు నీటిలో మునిగాయి. పంపు వద్ద గోడల పగుళ్ల ద్వారా పంప్‌హౌస్‌లోకి నీరు చేరి మోటార్లు పూర్తిగా మునిగిపోయాయి. పాలమూరు రంగారెడ్డి పనుల వద్ద బ్లాస్టింగ్ చేయడం వల్లే పగుళ్లు వచ్చినట్లు కేఎల్ఐ సిబ్బంది చెబుతున్నారు.
మహాత్మగాంధీ ఎత్తిపోతల పథకం మోటర్ల మునక
కృష్ణా నదిలో ప్రవాహం పెరగటంతో పాటు పాలమూరు-రంగారెడ్డి పనుల వద్ద బ్లాస్టింగ్ చేయడం వల్లే పగుళ్లు వచ్చినట్లు కేఎల్ఐ సిబ్బంది చెబుతున్నారు. గతంలోనూ పంప్‌హౌస్ వద్ద లీకేజీతో మోటర్లు మునిగిపోయాయి.
ఇదీ చదవండి:రాష్ట్రంలో సందడిగా మొదలైన బతుకమ్మ వేడుకలు
Last Updated : Oct 16, 2020, 10:45 PM IST