తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేఎల్​ఐ డీ-82 కాల్వ గండ్లు త్వరగా పూడ్చివేయాలి'

నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ మండలంలోని కేఎల్ఐ డీ-82 కాల్వకు ఏర్పడిన గండ్లను త్వరిత గతిన పూడ్చివేయాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. నాణ్యత ప్రమాణాల్లో లోటు లేకుండా ప్రతి ఒక్క అధికారి, గుత్తేదారు కలిసి కాల్వ నిర్మాణ, మరమ్మతు పనులను పూర్తి చేయాలని సూచించారు.

KLI kaaluva gandi pudchiveta AT VELDANDA IN NAGARKURNOOL DISTRICT
'కేఎల్​ఐ డీ-82 కాల్వకు ఏర్పడిన గండ్లను త్వరగా పూడ్చివేయాలి'

By

Published : Sep 20, 2020, 1:01 PM IST

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని లచ్చపురం చెరువు దగ్గర కేఎల్ఐ డీ- 82 కాల్వకు ఏర్పడిన గండ్లను త్వరిత గతిన పూడ్చి చేయాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కేఎల్ఐ కాల్వలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోందని.. దీనితో కాల్వ పనులు పూర్తికాని ప్రాంతంలో నీటి ప్రవాహ వేగానికి గండ్లు పడుతున్నాయని ఆయన తెలిపారు.

రైతులకు సంబంధించిన పంట పొలాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. పనులు నాణ్యతగా చేపట్టి చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని కేఎల్ఐ అధికారులకు, గుత్తేదారులకు ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో వెల్దండ సర్పంచ్ భూపతి రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో రాగల 2 రోజులపాటు అక్కడక్కడ భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details