పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్యను ఆదుకోవడానికి సంగారెడ్డి జిల్లాలోని బీడీఎల్ ఉద్యోగుల స్వచ్ఛంద సేవాసంస్థ విన్నర్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. మొగులయ్య దైన్యతపై ఆదివారం ‘ఆదరణ కోల్పోయిన కళ.. భిక్షమెత్తుకుంటున్న కళాకారుడు’ శీర్షికతో ‘ఈటీవీ భారత్’లో ప్రచురితమైన కథనానికి విన్నర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రఘు అరికపూడి, సభ్యులు స్పందించారు.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కిన్నెర కళాకారుడికి చేయూత
పన్నెండు మెట్ల కిన్నెర వాద్యకారుడు మొగులయ్య ఉపాధి కోల్పోయి భిక్షమెత్తుకోవడంపై ఈటీవీ భారత్ రాసిన ‘ఆదరణ కోల్పోయిన కళ.. భిక్షమెత్తుకుంటున్న కళాకారుడు’ కథనానికి స్పందన లభించింది. మొగులయ్యకు ప్రతి నెల ఆర్థిక సాయం, నిత్యావసర సరకులు అందజేసేందుకు సంగారెడ్డి జిల్లాలోని బీడీఎల్ ఉద్యోగుల స్వచ్ఛంద సేవా సంస్థ విన్నర్ ఫౌండేషన్ ముందుకొచ్చింది.
కిన్నెర కళాకారుడు, కిన్నెర కళాకారుడు మొగులయ్య, కిన్నెర కళాకారుడు మొగులయ్యకు సాయం
సోమవారం వారు నాగర్‌కర్నూల్ జిల్లాలోని అవుసలికుంట గ్రామానికి వచ్చి మొగులయ్య స్థితిగతులను తెలుసుకున్నారు. నెలకు రూ.3వేల చొప్పున ఆయనకు ఆర్థిక సహకారం అందించనున్నట్లు రఘు తెలిపారు. మూడు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు, రూ.3వేల నగదు అందజేశారు. మొగులయ్య ఇంటి నిర్మాణానికీ సహకరిస్తామని హామీ ఇచ్చారు.
- సంబంధిత కథనం :ఆదరణ కోల్పోయిన కళ.. భిక్షమెత్తుకుంటున్న కళాకారుడు